PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి

1 min read

డ్వాక్రా బజార్ లో అన్ని ఉత్పత్తులు లభించే విధంగా మరింత అభివృద్ధి చేయాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు పెద్ద ఎత్తున మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.శుక్రవారం స్థానిక సి.క్యాంప్ లో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్, జిల్లా సమాఖ్య  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ ను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళా మార్ట్ లో చేస్తున్న విక్రయాలు  చేస్తున్న వస్తువులను  పరిశీలించారు..ఎంత మేరకు విక్రయాలు జరుగుతున్నాయి అని మహిళలను అడిగి తెలుసుకున్నారు.. మార్ట్ ను మరింత అభివృద్ధి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం డ్వాక్రా బజార్ లో  విక్రయిస్తున్న డోర్ మాట్స్,జీన్స్ ప్యాంట్స్, స్వయం సహాయ సంఘాల మహిళలు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అక్కడే విక్రయిస్తున్న జీన్స్ ప్యాంట్స్ తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు.  జీన్స్ ప్యాంట్లు విక్రయిస్తున్నట్టు వినియోగదారులకు తెలిసేలా ఆకర్షణీయంగా డిస్ప్లేచేయాలని సూచించారు.. . జిల్లాలో స్వయం సహాయక సంఘాలు తయారుచేసే అన్ని ఉత్పత్తుల తో డ్వాక్రా బజార్ ను  మరింత అభివృద్ధి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.జిల్లాలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు పెద్ద ఎత్తున మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని  కలెక్టర్ డిఆర్డిఏ పిడిని ఆదేశించారు.. పెద్ద పెద్ద మార్టులు, షాపులతో టై అప్ చేసి మార్కెటింగ్ లింకేజి డెవలప్ చేయాలని సూచించారు.. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులతో ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి,డిఆర్డిఏ పిడి నాగశివ లీల తదితరులు పాల్గొన్నారు.

About Author