మాదిగ ఉమేష్ పై పెట్టిన రేప్ కేసును ఎత్తివేయాలి…!
1 min readకోమాలో ఉన్న బాధితుడి పై రేప్ కేసు ఎలా పెడతారు
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్. జె. ప్రకాష్ మాదిగ..
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం హలహర్వి మండలం గూల్యం గ్రామంలో బీసీ కులస్తుల చేతుల్లో దాడికి గురైనా దళిత యువకుడు ఉమేష్ పై పెట్టిన కౌంటర్ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎమ్మార్పీఎస్ హలహర్వి మండల అధ్యక్షులు బాపురం వీరేష్ మాదిగ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్. జె. ప్రకాష్ మాదిగ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిష్టన్న మాదిగ, గంధం శ్రీనివాస్ మాదిగ, రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాదిగ గారు హాజరయ్యారు. ఆలూరు తాలుకా అధ్యక్షులు కత్తి రామాంజనేయులు మాదిగ మరియు పత్తికొండ డివిజన్ అధ్యక్షులు గూల్యం యల్లప్ప మాదిగ అధ్యక్షతన జరిగిన రాస్తారోకో కార్యక్రమంలో …………….. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్. జె. ప్రకాష్ మాదిగ మాట్లాడుతూ మాదిగ ఉమేష్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళిన వ్యక్తి పై రెండు గంటల వ్యవధిలో పోలీసులు కౌంటర్ కేసులో భాగంగా రేప్ కేసు నమోదు చేయడం చాలా సిగ్గు చేటు దుర్మరగూ అని, న్యాయం చేయాల్సిన పోలీసులే ఎస్సీ ఎస్టీ కేసులను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి మరియు జాతీయ ఎస్సీ కమీషన్ దృష్టికి తీసికెళ్ళి బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ మాదిగలపై దాడులకు పాల్పడితే చూస్తూ ఉరుకునే పరిస్థితి లేదని ఈ ఆలూరు నియోజకవర్గంలో బీసీల బోయలు తర్వాత ఎస్సీ మాదిగలే మెజారిటీగా ఉన్నారని దాడికి ప్రతిదాడి కచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు.రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాదిగ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీసీ బోయ కులస్తులు మాదిగలపై దాడులకు పాల్పడుతుంటే గెలుపోందిన బీసీ ఎమ్మెల్యేలు దాడిలో గాయపడిన బాధితులను కనీసం పరామర్శించరు. దాడులకు పాల్పడుతున్న వారిని పెద్దరికంగా హెచ్చరించరు. మీరు గెలుస్తున్నారంటే మీ గెలుపులో మాదిగల ఓట్లు ఉన్నాయనే సంగతి గ్రహించాలని గుర్తు చేశారు. ఇక పోలిస్ అధికారులు కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే కౌంటర్ కేసు పెట్టడమే కాకుండా రేప్ కేసు ఎలా పెడతారని పై అధికారులు చెప్తే ఏదైనా చేస్తారా అంటూ మండిపడ్డారు.కోంతమంది పోలీసు అధికారులు మాదిగ నాయకులే టార్గెట్ గా చేసుకుని వారిపై దందాలు, పంచాయతీలు, రౌడీయిజం చేస్తారంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని… ఏ కులస్తులు రౌడీయిజం చేస్తూన్నారో ఆలూరు నియోజకవర్గంలోని ప్రజలకు తెలుసని ఇలా అసత్య ప్రచారాలు చేసే వారిపై లీగల్ గా పోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మోషే, బీఎస్పీ నాయకులు రామలింగయ్య, ఆదోని డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, నవ్యాంధ్ర నాయకులు శాసం రామాంజనేయులు మాదిగ, చిప్పగిరి మండల అధ్యక్షులు కరెంట్ గోవిందు మాదిగ ఆలూరు టౌన్ అధ్యక్షులు చంద్రశేఖర్ మాదిగ, గూల్యం సర్పంచ్ కుమారుడు నాగరాజు, ఎంపిటిసి మల్లికార్జున, సిపిఐ నాయకులు రామాంజనేయులు, ఖాజీపురం రాంబాబు, నారాయణ, వెంకటేష్, సినిమా మంగన్న మరియు దేవనకోండ, ఆస్పరి, చిప్పగిరి మండలాల నుంచి పెద్ద ఎత్తున మాదిగలు గూల్యం గ్రామంలోని ఎస్సీలు పాల్గొన్నారు.