ఓటర్ నమోదు..మార్పులకు అవకాశం:తహసిల్దార్
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: 18 సం.లు దాటిన యువతీ యువకులు కొత్తగా ఓటరు నమోదు చేసుకోవచ్చని నంద్యాల జిల్లా నందికొట్కూరు తహసిల్దార్ బి శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల నవంబర్ లో 9,10,23,24 తేదీల్లో (బుధ ఆదివారం) రోజుల్లో ప్రత్యేకంగా సమ్మరీ రీ విజన్ కార్యక్రమంలో తహసిల్దార్ మరియు సహాయ నమోదు ఓటర్ అధికారులు పైన కనబరిచిన తేదీల్లో ఓటర్లకు అందుబాటులో ఉంటారని వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.అంతే కాకుండా గతంలో ఓటు ఉండి వాటిలో ఉన్న తప్పులను సవరించుకునే అవకాశం ఉందని చిరునామా మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని తహసిల్దార్ ఓటర్లకు సూచించారు.