అర్జీలను రిజిస్ట్రేషన్ చేసి మ్యాపింగ్ చేయడంపై పూర్తి అవగాహన ఉండాలి..
1 min readజిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను రిజిస్ట్రేషన్ చేసి మ్యాపింగ్ చేయడంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్” కు వచ్చే అర్జీల తప్పులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి మ్యాపింగ్ చేసేలా కంప్యూటర్ ఆపరేటర్లకు జిల్లా రెవెన్యూ అధికారి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్”కు వచ్చే దరఖాస్తులకు తప్పులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి మ్యాపింగ్ చేయు విధానంపై కంప్యూటర్ ఆపరేటర్లకు ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్ నందు తప్పులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వచ్చిన అర్జీ ఏ డిపార్ట్మెంట్ సంబంధించినదని తెలుసుకొని ఆ డిపార్ట్మెంట్ వారికి పంపించేలా మ్యాపింగ్ చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల సమయం వృధా కాకుండా నిర్ణీత సమయంలోనే అర్జీదారునికి సమస్య పరిష్కరించవచ్చన్నారు. వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కంప్యూటర్ ఆపరేటర్లకు, అవగాహన కల్పించడంతో పాటు పిజిఆర్ఎస్ లో అప్లోడ్ చేసిన తప్పుడు ఎండార్స్మెంట్స్ పై పిజిఆర్ఎస్ ,కెఆర్సిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. సమావేశంలో కెఆర్సిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగ ప్రసన్న లక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.