నేరస్తులకు సింహాస్వప్నం.. సిఐ సుదర్శన్ రెడ్డి
1 min readచోటా నాయకుల అవినీతి, అక్రమ దందాలకు చెక్
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : పట్టణంలో నేరస్తులకు సింహ స్వప్నం సిఐ. సుదర్శన్ రెడ్డి అవును.. హీరో అవ్వాలని.. ఏదేదో చేయాలని లేదు.. తమకు అన్యాయం జరిగిందని ఏ బాధితుడు నావద్దకు వచ్చినా.. న్యాయం అందించేందుకు సిద్ధంగా ఉంటా.. అదే నాకిష్టం.. అంతేకానీ.. సొసైటీలో పెద్ద హీరోగా చలా (శివ) మణి అవ్వాలని లేదు.. నేను చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం సమాజంలో మంచికి ఉపయోగపడితే చాలు.. పలానా సార్ దగ్గరికి వెళ్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది.. అని బాధితులు విశ్వసిస్తే చాలు.. మా పోలీస్ డిపార్ట్మెంట్ హీరో అయినట్లే.. ఎన్ని ప్రాంతాల్లో పని చేసినా.. నన్ను ప్రజలు ఆదరించారు. అది చాలు.. ఉన్నతాధి కారులు కూడా నన్ను నమ్మారు.అందుకే నాకు ఎమ్మిగనూరు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తా.. అసలు పోలీస్ ఉద్యోగం అంటేనే ఎన్నో సవాళ్లు.. రోజుకు ఎన్నో ఫిర్యాదులు, బాధితులు స్టేషన్లకు వస్తుంటారు.ఆ రెండు వర్గాల్లో ఒకవైపే న్యాయం ఉంటుంది. అది గుర్తించగలిగితే చాలు.. డ్యూటీ చేసినట్లే.. అంతేకాని తప్పును ఒప్పు చేయమనే సిఫార్సులకు తలొంచితే ఖాకీ దుస్తులు ధరించడంలో అర్ధం లేదు.. చేతనైనంత వరకు మంచి చేయగలిగాలి. నా సిబ్బందికి కూడా ఇదే చెప్తాను. ఒత్తిళ్లకు తలొంచి తప్పు చేస్తే సహించను. ఆయన సిద్ధాంతం వేరు.. న్యాయం వైపు, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొంచకుండా నిజాయితీగా పనిచేసే అధికారులను చాలా అరుదుగా చూస్తుంటాం._అలాంటి అధికారే ఆయన.. ఎమ్మిగనూరు పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి .ఎమ్మిగనూరు పట్టణానికి వచ్చిన కొద్ది రోజులకే అధికార పార్టీకి చెందిన చోటా నాయకుల ఆగడాలు సాగవని తెలుసుకోని సిఐ ను ఇక్కడి నుంచి బదిలీ చేయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తునే వచ్చారు.ఎమ్మిగనూరు ప్రజలు మాత్రం ఎమ్మిగనూరుకు సరైన పోలీస్ అధికారి వచ్చాడని హర్షం వ్యక్తం చేశారు.” పోలీస్ ఈ పేరు వినగానే ప్రజల్లో ఓ భరోసా కలుగుతుంది. పోలీసు లేని సమాజం ఊహించలేం.అరాచకవాదులు, సంఘ విద్రోహశక్తులు పెట్రేగిపొయినప్పుడు సామాన్యులకు ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే. సమాజంలో పోలీసు వ్యవస్థకు మంచి గుర్తింపు ఉంది.అయితే కొంతమంది అవినీతి అధికారులు పోలీసు శాఖలో నూ చోటు చేసుకొవడం విచారకరం, ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగం కత్తి మీద సాములా తయారైయింది.ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యవస్థను కొంత మంది రాజకీయ చోటా నాయకులు తమ గుపెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి మనోధైర్యాన్ని నీరుగారుస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో గత ఐదు నెలల క్రితం పట్టణ పోలీసు స్టేషను సిఐగా భాధ్యతలు స్వీకరించారు. అయితే సిఐగా భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణంలో అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు._ ఎమ్మిగనూరు పట్టణంలో అక్రమ వ్యాపారం, రౌడీయిజం, దందాపై పోలీసు సిబ్బందితో ఆరాతీస్తున్నారు పట్టణ పోలీస్ స్టేషన్ కు ప్రజలు ఏ సమస్యపై మెట్లు ఎక్కినా నేరుగా సిఐ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసు సిబ్బంది విచారణ చేయాలనే పద్దతులు బాగానే ఉన్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో మాత్రం అలసత్వం వహించకుండా .. చట్టం తన పని తాను చేసు కుంటూ పోతున్నట్లు.. తన విధి నిర్వహణలో కూడ ఎక్కడ, ఎవరికి తలోగ్గకుండా తనపని తాను చేసుకుంటూ పోతున్న తీరు కొంతమంది చోటా రాజకీయ నాయకులకు మింగుడు పడటం లేదని సమాచారం. అయితే ఈ పట్టణ సిఐ ఏ చోటా రాజకీయ నాయకులకు వత్తాసు పలకకుండా, ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా తమ సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా నిజాయితీగా పనిచేస్తున్న తీరుపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఆక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నంలా వచ్చాడని ప్రజలు చర్చించుకుంటున్నారు._ స్వార్ధపూరిత పొగడ్తల వలలో పడకుండా కాకా బ్యాచ్ ల కాకాలను లెక్కచెయ్యకుండా ఈ ఖాకీ తన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్న పట్టణ ప్రజలు ఇంతకాలానికి ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషను నిజంగానే ఒక నాలుగవ సింహం వచ్చిందని ప్రజలు హర్షం వ్యక్తం చేసే లోపే అధికార పార్టీ నాయకులు అధిష్ఠానం నుంచి ఒత్తిడి తీసుకువచ్చి ఎట్టకేలకు బదిలీ చేయించారు.మరి నూతనంగా భాద్యతలు స్వీకరించే సిఐ శ్రీనివాసులు కూడ సుదర్శన్ రెడ్డి లా విధులు నిర్వహిస్తాడా..? లేదా అధికార పార్టీ చోటా నాయకులకు తలొగ్గి పనిచేస్తాడా..? అన్నది వేచిచూడాల్సిందే మరి.