జన సంరక్షణ సేవాసమితి కర్నూలు జిల్లా అధ్యక్షునిగా అమానుల్లా ఏకగ్రీవ ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : జన సంరక్షణ సేవాసమితి కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం అమానుల్లా ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులైన రజాక్ వలి కర్నూలు జిల్లా అధ్యక్షునిగా నియామక పత్రాన్ని అందించడం జరిగింది.ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం నిరుద్యోగులకు ఉపాధి కల్పన పై అవగాహన కల్పించడం ప్రభుత్వం పథకాలపై ప్రజలకు చైతన్యం కలిగించడం గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమలను కుటీర పరిశ్రమల కొరకు చైతన్యం కలిగించడం అనాధ పిల్లలకు విద్యా మౌలిక సదుపాయాలు కల్పించడం జన సంరక్షణ సమితి యొక్క ముఖ్య ఉద్దేశమని కొత్తగా ఎన్నికైన అమానుల్లా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రజాక్ వలి రాష్ట్ర ఆర్గనైజేషన్ అధ్యక్షులు వసంత బాబు వివిధ జిల్లాల అధ్యక్షులు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.