PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలగనూరు రిజర్వాయర్ గండి పూర్తి చేయండి

1 min read

తాగు సాగునీరు అందించాలని సోమన్న డిమాండ్..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు రిజర్వాయర్ ప్రాజెక్టు గండి మరమ్మతులు పూర్తిచేసి రైతులకు తాగు సాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న,జిల్లా సమితి సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గడివేముల,మిడుతూరు మండలాల్లో జీపు ప్రచార జాత నిర్వహించారు.తలముడిపి, రోళ్లపాడు,జలకనూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.అనంతరం సోమన్న,జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్,పిక్కిలి వెంకటేశ్వర్లు జలకనూరు గ్రామంలో మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్ కట్ట తెగిపోయి 4 సం.లు దాటినా గత పాలకుల నిర్లక్ష్యమా అని రైతులను పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టులు కేవలం బటన్ నొక్కి కార్యక్రమం చేయడంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత జిల్లా కలెక్టర్ గత నెలలో అలగనూరు రిజర్వాయర్ ను సందర్శించి 34 కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపారని తక్షణమే ముఖ్యమంత్రి బడ్జెట్ కేటాయించి రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు అన్నారు.వీటితోపాటు నందికొట్కూరు పట్టణానికి త్రాగు నీటికి 120 కోట్లు గతంలో నిధులు మంజూరు చేసినా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నందికొట్కూరు పట్టణానికి రిజర్వాయర్ ద్వారా తాగునీరు రాలేదన్నారు.రిజర్వాయర్ గండి కట్ట నిర్మాణం పూర్తయిన వెంటనే నందికొట్కూరు ప్రాంతానికి త్రాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అబ్రహాం, భాష,సోమన్న,మాభాష,పెద్ద రాముడు పాల్గొన్నారు.

About Author