PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ “సీ ప్లేన్”

1 min read

రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మార్చి నుంచి పర్యాటకులకు సీప్లేన్ అందుబాటులోకి తెస్తాం

పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం

శ్రీశైలం మాస్టర్ ప్లాన్ కొరకు మంత్రుల మాస్టర్ తో కమిటీ

శ్రీశైలం ప్రెస్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో “సీ ప్లేన్” ప్రవేశపెట్టడం అద్భుతమైన ఆవిష్కరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.శనివారం శ్రీశైలం పాతాళగంగ రోప్ వే ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… శ్రీశైలం ఇదోక దివ్య క్షేత్రం. పరమశివుని 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. ఈరోజు ఒక ముఖ్యమైన సీప్లేన్ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక వినూత్నమైన కార్యక్రమం. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్లో ప్రయాణం చేయడం అద్భుతంగా ఉంది. శ్రీశైలం దక్షిణ భారతదేశంలో ఈ ప్రముఖ దేవాలయాన్ని దక్షిణకాశీగా పిలుస్తారు. మల్లికార్జునస్వామి భ్రమరాంబదేవి స్వయంభువులుగా కొలువై ఉన్నారని ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం. ఇక్కడ దర్శనం చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి వస్తుంది. పరమ పవిత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సీ ప్లేన్ ప్రారంభమై… మరొక దివ్య క్షేత్రం శ్రీశైలంలో దిగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఒక మంచి ప్రదేశం ఒక అద్భుతమైన దృశ్యాలు చూస్తూ 40 నిమిషాల్లో విజయవాడ నుండి శ్రీశైలం చేరుకున్నాం. హెలికాప్టర్లు విమానాల్లో తిరిగిన దానికన్నా నాకు ఇది ఒక కొత్త అనుభూతి.

About Author