జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణం
1 min readకర్నూలు జిల్లా నుండి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు కర్నూలు జిల్లా నుండి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఈనెల 7 నుండి10 వ తేది వరకు కాకినాడ లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ జిమ్నాస్టిక్స్ కాంపిటీషన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నలుగురు క్రీడాకారులు, బ్రాంజ్ మెడల్ సాధించిన ఒక క్రీడాకారిణి ని కలెక్టర్ అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు.ఈనెల 7 వ తేది నుండి 10 వ తేది వరకు ఎస్ జి ఎఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జిమ్నాస్టిక్స్ కాంపిటీషన్స్ కాకినాడ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలలో అండర్ 19 కింద గోల్డ్ మెడల్ సాధించిన కనిష్క్ , హేమంత్ కుమార్, వర్షిత, వినీల,అండర్ 14 లో బ్రాంజ్ మెడల్ గిరీష్మా దేవి సాధించారని, వారిని కలెక్టర్ అభినందించారు. డిసెంబర్ నెలలో కలకత్తాలో జరిగే జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు కర్నూలు జిల్లా నుండి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం అని కలెక్టర్ అభినందించారు.కార్యక్రమంలో డిఎస్డిఓ భూపతి, జిమ్నాస్టిక్ కోచ్ టి. పవన్ కుమార్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.