ప్రభుత్వ ఉద్యోగులు పని వత్తిడిని జయించటంలో క్రీడలు ఎంతగానో దోహదపడతాయి
1 min readజాతీయస్థాయిలో రాణించి రాష్ట్రానికి,నియోజకవర్గానికి మంచి పేరు తేవాలి
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పలువురు క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు నియోజకవర్గంలోని పంచాయితీ రాజ్ శాఖ నుంచి రాష్ట్ర స్థాయి టీమ్ కి ఎంపి ఎంపికయ్యి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు. దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో మంగళ వారం ఉదయం ఎమ్మెల్యే చింతమనేని ని పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మర్యాద కలిశారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యే కి వినతి పత్రాలు అందజేశారు. అధికారులకు సత్వరమే వాటిని పరిష్కరించేల చర్యలు చేపడతామని తెలిపారు.ఇటీవల జాతీయ స్థాయి క్రీడ పోటీలకుఎంపికైన పలువురు ప్రభుత్వ సిబ్బంది ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ లో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం పెదవేగి మండలానికి చెందిన పంచాయితీ రాజ్ శాఖ సిబ్బంది వలపుల సౌజన్య, (బాస్కెట్ బాల్ ), విజయిరాయి గ్రామ పంచాయితీ సెక్రటరీ, M.రవితేజ ( వాలీ బాల్) , భోగాపురం గ్రామ ఇంజినీరింగ్ అసిస్టెంట్, J అజయ్ కుమార్, (బాస్కెట్ బాల్) బాపిరాజు గూడెం వెల్ఫేర్ అసిస్టెంట్ లు ఇటీవల జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో తమ ప్రతిభను కనబరచి జాతీయ స్థాయి లో పోటీలకు స్టేట్ టీమ్ కు ఎంపిక అవ్వటం ఎంతో అభినందనీయం అని అన్నారు. త్వరలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచి విజయం సాధించి ఇటు దెందులూరు నియోజకవర్గానికి, అటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది పని వత్తిడి వల్ల అలసిపోయి మానసిక రుగ్మతలకు గురి అవుతూoటారు అవుతుంటారని, అటువంటి వారికి క్రీడలు దేహ దారుఢ్యం తో పాటు మానసిక వికాసానికి కూడా ఎంతో దోహద పడతాయని అన్నారు.ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందించారు.