పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సారించాలి….జడ్పీ సీఈఓ ఓబులమ్మ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలో స్వచ్ఛభారత్ కు సంబంధించిన పనితీరు బాగుందని, పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త ,పొడి చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించడంలో గ్రామపంచాయతీ అధికారులు సఫలీకృతులయ్యారని జడ్పీ సీఈవో ఓబులమ్మ అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ లను, గ్రామ సచివాలయాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆమె అక్కడ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని, అన్ని గ్రామ పంచాయతీలలో ఎక్కడ ఏ సమస్య ఉన్న అక్కడికి వెళ్లి పరిశీలించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నిరక్షరాశులను గుర్తించి వారికి విద్య బోధన అందించాలి
ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో నిరక్షరాశులను గుర్తించి వారికి విద్యా బోధన అందించాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డిలు అన్నారు. మంగళవారం స్థానిక మండల సభ భవనంలో అంగన్వాడీ కార్యకర్తలకు, డ్వాక్రా మహిళలకు ఏర్పాటుచేసిన ఉల్లాస్ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, గ్రామాలలో మీ పరిధిలోని 15 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల లోపు నిరక్షరాశులను గుర్తించి వారికి విద్యాభ్యాసాన్ని అందించాలని కోరారు, ముఖ్యంగా మహిళలలో మంచి పరిజ్ఞానం ఉంటుందని అలాంటప్పుడు వారికి అక్షర జ్ఞానం నేర్పినట్లైతే మరింత ప్రోత్సహించిన వారం అవుతామని వారు తెలిపారు. వైయజనులకు విద్యాభ్యాసం అందించేందుకు మీ మీ దగ్గరలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో వారికి విద్యాభ్యాసం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.