ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి
1 min readపూళ్ల లో రైస్ మిల్లులలో దిగుమతికి సంబంధించి పలు అంశాలపై మిల్లర్లకు ఆదేశాలు
నాణ్యత ప్రమాణాలు పాటించి రైతులకు ఇబ్బంది కలుగ కుండా చేయాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలోl 2024-25 ఖరిఫ్ పంట కాలమునకు సంబంధించి ఇంతవరకు రూ.15.98 కోట్లవిలువైన 7,101 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు.సోమవారం పూళ్ళ ఎల్ ఎస్ సి ఎస్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రములను జాయింట్ కలెక్టరు పరిశీలించారు. పూళ్ళ లోని శ్రీ కస్తురీ రైస్ మిల్లు , శ్రీ వెంకట సుబ్బరాజు రా & బాయిల్డు రైస్ మిల్లులలో ధాన్యమును దిగుమతికి సంబంధించి ఆలస్యము జరుగుట గ్రహించి రైస్ మిల్లర్లకు ధాన్యము రైస్ మిల్లుకు రాబడిన వెంటనే నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతుకు ఇబ్బంది కలుగకుండా సకాలములో ధాన్యము సేకరణ పోర్టల్లో ట్రక్ చిట్ ద్వారా ధాన్యము రైస్ మిల్లుకు చేరినట్లుగాను మరియు సదరు ధాన్యము దించుకున్నట్లుగా దృవీకరించవలసిదిగా అదేశించారు. జిల్లాలోని రైతులు వారు పండించిన ధాన్యము. వారు కోరిన రైస్ మిల్లుకు తరిలించుకోనుటకు ప్రభుత్వం వారు అవకాశము కల్పించినoదున నిర్దారిత నాణ్యతా ప్రమాణాలు పాటించి కనీస మద్దతు దరకు విక్రయించు కోనవలసిదిగా కోరారు. రైతుల ధాన్యము రైస్ మిల్లుకు చేరుకోవడానికి అవసరమైన అంచనా సమయం రవాణా కాబడిన సమయం నుండి దూరము ఈ క్రింది విధముగా నిర్ణయించారని క్రింది విధముగా సమయపాలన చేయచు సకాలంములో రైతుల దాన్యమును దిగుమతి కాబడే విధముగా తగు హమాలిలను మరియు ఇతర అవసరమైన అన్ని ఏర్పట్లు ఉండేలా చూసుకోవాలనీ ,జిల్లాలోని రైస్ మిల్లర్లు తగు జాగ్రత్త వహించవలసిదిగా తెలియజేశారు. 10 మెట్రక్ టన్నులక10 కిమీ 3 గంటలు, 20 కిమి 4 గంటలు, 40 కీమీ 5 గంటలు,10 నుండి 20 మెట్రక్ టన్నలుకు 10 కీమి 4 గంటలు, 20 కీమీ 5 గంటలు, 40 కీమీ 6 గంటలు,20 నుండి 30 మెట్రక్ టన్నలుకు పైబడి 10 కీమి 5 గంటలు, 20 కీమీ 6 గంటలు, 40 కీమీ 7 గంటలు, 40 కిమీల కంటే ఏక్కువ ప్రతి 10 కిమీల అదనపు దూరానికి ½ గం కలుపుకోనవలసిదిగాతెలిపారు. రైస్ మిల్లర్లు ప్రత్యేక వ్యక్తి గత శ్రద్దవహించి సకాలములో రైతుచే విక్రయించబడిన రైస్ మిల్లు తరలించబడిన దాన్యము దింపుకోని ధాన్యము కొనుగోలు ప్రకియ విజయవంతము చేయవలసిదిగా కోరారు. సొంత వాహనము కల రైతులు వారు వారికి సంభంధించి వాహన వివరములతో సంభంధింత రైతు సేవా కేంద్రమును సంప్రదించినచో వారు ధాన్యము తరలిచుంటకు వాహనమును అన్ లైన్ నందు ముందుగా రిజిష్ట్రేషన్ చేయుటకు అవసరమైన అన్ని చర్యలు జిల్లా యంత్రాగం చేపట్టిందన్నారు. కావున స్వంత వాహనము కల రైతు స్వచ్ఛందంగా ముందుకు రావలసిదిగా కోరారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై పూర్తి పర్యవేక్షణకు అవసరమైన చోట్ల క్షేత్ర స్థాయిలో మండలల వారిగా ప్రత్యేక అధికారులను నియమించమన్నారు. అంతేకాకుండా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై ఫోన్ ద్వారా రైతుల సందేహాలపై తగిన సలహాలు మరియు సమాచారం పొందుటకు వారి యొక్క ఫిర్యాదు చేయుటకు, వాటి పరిష్కరం కొరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ (కంట్రోల్ రూమ్ నెంబర్లు 08812-230448, 7702003584, మరియు టోల్ ఫ్రీ 18004256453) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.