జీతాల కోసం ఎంపీటీసీ ల ఎదురు చూపులు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): జీతాల కోసం ఎంపీటీసీ సభ్యుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 19 గ్రామ పంచాయతీలకు గాను 12 మంది ఎంపీటీసీ సభ్యులు మరియు ఒక కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు.ఎంపీపీకి 6 వేలు,ఎంపీటీసీ లకు 3 వేలు నెల జీతం ఉంది.ఈ 13 మందికి 2024 జనవరి వరకు జీతాలు వీరికి వచ్చాయి. తర్వాత ఫిబ్రవరి నుండి ఇంత వరకు పది నెలలు మరియు పాతవి 4 నెలలు అనగా మొత్తం 14 నెలల జీతం మాకు రావాల్సి ఉందని ఎంపీటీసీలు అంటున్నారు.జీతాలు రాకపోవడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంపీటీసీలు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి జీతాలు మంజూరు చేయాలని ఎంపీటీసీ సభ్యులు కోరారు.వీటిపై ఎంపీడీఓ పి దశరథ రామయ్యను వివరణ కోరగా జీతాల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపడం జరిగిందని ఆయన తెలిపారు.