ఏజెన్సీ ఉద్యోగిని విధులకు దూరం..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది దేవస్థానంలో పనిచేయుచున్న ఒక ఏజెన్సీ ఉద్యోగిని విధులకు దూరంగా ఉంచినట్లు విశ్వాసనీయ సమాచారం. బుధవారం క్షేత్రంలో దైవ దర్శనం చేసుకున్న అనంతరం ఒక భక్త బృందం పెద్ద నంది వద్ద ఫోటోలు తీసుకోవడానికి, అక్కడ కొద్దిసేపు ఉండి సేద తీరడానికి లోనికి వెళ్లారు. అక్కడ సాధారణంగా లోనికి వెళ్లడానికి కొంత రుసుమును అధికారికంగా వసూలు చేస్తారు. కానీ అక్కడ పనిచేసే ఏజెన్సీ ఉద్యోగిని ఒకరు భక్త బృందం నుండి రుసుము కు సంబంధించిన కొంత మొత్తాన్ని తీసుకొని వారిని లోపలికి అనుమతించారు. కానీ రుసుము కు సంబంధించిన టికెట్టు వారికి అందజేయలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. లోపలికి ప్రవేశించిన భక్త బృందం తిరిగి బయటికి వచ్చేటప్పుడు టికెట్ వివరాలు అడగగా మీరు పెద్ద నంది వద్ద మీకు కావాల్సిన అంతసేపు గడిపారు కదా మీకు టికెట్ తో ఏం పని ఉంది బయటికి వెళ్ళవచ్చని భక్తులకు సూచిస్తూ మీరు ఇక్కడ నుండి వెళ్లిపోవచ్చని హెచ్చరించినట్లు ఆరోపణలు వెలువత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఆలయ అధికారులకు భక్త బృందం చేరవేసినట్లు తెలిసింది. దీంతో ఆలయ అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించి అక్కడ ఉన్న ఏజెన్సీ ఉద్యోగిని విధుల నుండి తప్పించి ఇక మీ సేవలు ఇంతటితో చాలు మీరు ఇంటికి వెళ్ళవచ్చని మరల ఇక్కడ ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదని కరాకండిగా తేల్చి చెప్పి విధులనుండి తొలగించినట్లు విశ్వాసనీయ సమాచారం. దీనికి సంబంధించి ఆలయ వర్గాలు కూడా ఇది నిజమేనని చర్యలు తప్పవని ధ్రువీకరిస్తున్నట్లు తెలుస్తుంది.