జియో ట్యాగింగ్ వెంటనే పూర్తి చేయాలి..
1 min readనగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని సచివాలయాల పరిధిల్లో పెండింగ్లో ఉన్న జియో ట్యాగింగ్లను తక్షణమే పూర్తి చేయాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం గురురాఘవేంద్ర నగర్ 92వ సచివాలయాన్ని అదనపు కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పలు సచివాలయాల్లో జియో ట్యాగింగ్ తీవ్ర జాప్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సచివాలయంలో సిబ్బంది అంతా తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి, రెండు రోజుల్లో జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని అదనపు కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆర్ఐలు భార్గవ్, తిప్పన్న, క్లర్క్ మన్సూర్ పాల్గొన్నారు.