లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు
1 min readఆర్డిఓ డాక్టర్ భరత్ నాయక్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ ఆర్డిఓ డాక్టర్ భరత్ నాయక్ హెచ్చరించారు. బుధవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఆడ శిశువులను గర్భంలోనే తుడిచి వేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. లింగ వివక్ష వదిలి ఆడ శిశువులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కొత్త స్కానింగ్ కేంద్రాలు, కొత్త రిజిస్ట్రేషన్లు రెన్యువల్ కు దరఖాస్తు చేసుకున్న వాటిని ప్రోగ్రాం ఆఫీసర్లు తనిఖీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తనిఖీల రిపోర్టులను పిసిపిఎన్డిటి జిల్లా స్థాయి కమిటీకి సమర్పించి ఆమోదం పొందాలన్నారు. జూనియర్ కళాశాలలు, హై స్కూల్ పాఠశాలలో ఆడపిల్లల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలని సూచించారు. గర్భస్థ లింగ నిర్ధారణ గురించి ఎవరికి మాటల ద్వారా గాని, సైగల రూపంలో గానీ, చేతుల రూపంలో గానీ చెప్పకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పిసిపిఎన్డిటి జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ నాగప్రసాద్, గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పన, డిప్యూటీ డెమో చంద్రశేఖర్ రెడ్డి, సిఐ జయన్న, డిస్టిక్ పిసిపి ఎన్ డి టి మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత, డిస్ట్రిక్ట్ డిప్యూటీ డెమో చంద్రశేఖర్ రెడ్డి, పత్తికొండ ఎన్జీవో K P R మైత్రి చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామ్మోహన్, హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా పాల్గొన్నారు.