హలో మాదిగ చలో కర్నూల్…
1 min readమాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సు.. ఉమ్మడి కర్నూలు జిల్లా
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద మండలంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పకీరప్ప మాదిగ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సు కరపత్రలను విడుదల చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సీనియర్ నాయకులు మరియు మండల ఇన్చార్జి భీమ మాదిగ మాట్లాడుతూభారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ పై ఇచ్చిన సానుకూల తీర్పుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1, డియల్, జెయల్ డి ఎస్ సి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నియామక ప్రక్రియను ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు అయ్యేంతవరకు నిలుపుదల చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ సానుకూల దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నారు.గౌరవ మన్య శ్రీ మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈనెల 18-11-2024 రెండు గంటలకు స్థలము : కోల్స్ కాలేజ్ గ్రౌండ్ కర్నూల్ నంద్యాల జిల్లాల ఉమ్మడి సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు గనుక మాదిగ మాదిగ ఉప కులాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఉమ్మడి జిల్లాలో ఉండబడే ఎంఆర్పిఎస్ ఎం ఎస్ పి హనుమంత సంఘాల నాయకులు కార్యకర్తలు సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయవలసినదిగా మందకృష్ణ మాదిగ అన్న పిలుపునివ్వడమైంది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు లింగపల్లి శేషగిరి, గోవిందు, రాముడు, ఎంపీటీసీలు మల్లికార్జున, కేంచప్ప, శివలింగ తదితరులు పాల్గొన్నారు.