అన్ని వార్డులలో అభివృద్ధి పనులు
1 min readనగరపాలక సంస్థ మేయర్ బి.వై. రామయ్య
10 అజెండాలకు స్థాయీ సంఘం ఆమోదముద్ర రూ.3.81 కోట్ల నిధుల ఖర్చుకు ఆమోదం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అత్యవసర పనులకు ప్రాధాన్యతనిస్తూ, అన్ని వార్డులకు సమాంతరంగా నిధులు కేటాయిస్తున్నామని నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. గురువారం నగరపాలక కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, సభ్యులు యం.విక్రసింహా రెడ్డి, మిద్దె చిట్టమ్మ, క్రాంతి కుమార్, జుబేర్, యూనూస్, అధికారులు హాజరయ్యారు. సాధారణ నిధుల నుండి రూ.3,81,43,000 నిధులను ఖర్చు చేయడానికి ఆమోదముద్ర వేశారు. 9 వార్డులలో అభివృద్ధి పనులు, క్లాప్ ఆటో డ్రైవర్లకు మరో 4 నెలల బకాయిల వేతనాలు చెల్లింపునకు అంశాలు కీలకంగా ఉన్నాయి. సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ జి.రాజశేఖర్, సిటి ప్లానర్ ప్రదీప్, ఆర్ఓ జునైద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, ఎంఈలు సత్యనారాయణ, శేషసాయి, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, ఎగ్జామినేషన్ సుబ్రహ్మణ్యం, సి3 జి.ఎం. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన తీర్మానాలు ఇవే..
- 46వ వార్డు నరసింహ రెడ్డి నగర్ నందు మురుగు, నీటి కాలువల నిర్మాణానికి రూ.48.00 లక్షలు కేటాయింపు. 2. 31వ వార్డు నందు సి.సి.డ్రైన్, కల్వర్టుల నిర్మాణానికి రూ. 34.00 లక్షలు కేటాయింపు. 3. 23వ వార్డు శ్రీరామ్ నగర్ నందు సి.సి కాలువలు నిర్మాణానికి రూ.49.90 లక్షలు మంజూరు.4. 24వ వార్డు నందు లక్ష్మి నగర్, జే.యాన్.ఆర్ నగర్ మరియు మద్దూర్ నగర్ ప్రాంతాల్లో సి.సి. కాలువలు రూ.49.90 లక్షలు కేటాయింపు.5. బుధవారపేట 14, 15వ వార్డులలో మురుగు నీటి కాలువలను రూ. 45.00 లక్షలు కేటాయింపు. 6. 30వ వార్డు శరీన్ నగర్ నందు మురుగు కాలువలు నిర్మాణానికి రూ. 49.95 లక్షలు కేటాయింపు.7. 27వ వార్డు ఆదిత్య నగర్ నందు సి.సి. డ్రైన్ నిర్మాణానికి రూ.26.00 లక్షలు మంజూరు.8. 2వ వార్డు గడియారం హాస్పిటల్, అలిషేర్ బాగ్ ప్రాంతంలోని మురుగు నీటి సమస్య పరిష్కారానికి, గడియారం హాస్పిటల్‌లోకి మురుగునీరు పోకుండా అవసరమైన ప్రాంతాల్లో కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.35.00 లక్షలు కేటాయింపు.9. క్లాప్ ఆటో డ్రైవర్లకు సంబంధించి డ్రైవర్లకు 4 నెలల బకాయి వేతనాలు చెల్లింపునకు రూ.43.68 లక్షలు కేటాయింపు.10. ఇటివలే గుత్తి పెట్రోల్ పంపు వద్ద వాహనాల పార్కింగ్ స్థలానికి నిర్వహించిన బహిరంగ వేళానికి ఆమోదించారు.