నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలంలో అంగన్వాడి శాశ్వత భవనం నిర్మించండి
1 min readహోళగుంద 4 వ వార్డు కాలనీవాసులు
పల్లెవెలుగు వెబ్ హోళగుంద: హోళగుంద మండల కేంద్రంలోని 4 వ వార్డులో గల 9 సెంట్ల ప్రభుత్వ స్థలం నిరుపయోగంగా ఉందని, ఈ స్థలంలో శాశ్వత అంగన్వాడి భవనం కానీ, ప్రాథమిక పాఠశాల భవనం కానీ నిర్మించాలని నాలుగవ వార్డు కాలనీవాసులు హోళగుంద పంచాయతీ కార్యదర్శి కి, మండల అభివృద్ధి అధికారిణికి, డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూహోళగుంద మండల కేంద్రంలోని 4 వ వార్డులో గల 9 సెంట్ల ప్రభుత్వ స్థలంలో చెత్తా చెదారం పేరుకోని పోయిందని, దీనివలన దోమల, ఈగలు ఇళ్లలో చేరి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఖాళీగా ఉన్న స్థలంలో చెత్తా చెదారం రోడ్డుపైనే పడేయడం వల్ల ఈ రోడ్డు పై తిరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది అని అన్నారు.ఈ స్థలంలో ప్రభుత్వ అంగన్వాడీ భవనం కానీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కానీ ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 4 వ వార్డు నందు ప్రభుత్వ అంగన్వాడీ భవనం లేక గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లేక ఇక్కడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.సదరు స్థలంలో అంగన్వాడీ భవనము కానీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కానీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగవ వార్డు కాలనీవాసులు అబ్దుల్ ఖాదర్, తాహెర్, చాంద్ భాషా, సిబిఎన్ ఆర్మీ, తెదేపా యువ నాయకుడు మోహిన్,సద్దాం, వాహీద్,ఉజేర్, ఉజెఫా,అబ్దుల్లా, ఖలీల్, నూరుల్లా, మహమ్మద్ గౌస్, జుబేర్, మతిన్, నజీర్, వారిస్, సత్తార్, సుభాన్, ఆదం, తదితరులు పాల్గొన్నారు.