పెదపాడు శాఖ గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన
1 min readగ్రంథాలయ పుస్తక పఠనం, అవశ్యకత చాలా ముఖ్యం
విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల పై అవగాహన కలిగి ఉండాలి
పెదపాడు ఎలక్ట్రికల్ ఏఇ వై రాంబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదపాడు శాఖా గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగినది.ఈ పుస్తక ప్రదర్శన పెదపాడు కరెంట్ ఆఫీస్ ఏఈ వై.రాంబాబు ప్రారంభించినారు, ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో పుస్తకాల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు తరువాత మారకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన చేసినారు,చుట్ట,బీడీ,సిగరెట్,పాన్ పరాగ్,గుట్కాలు వంటి వాటి జోలికి విద్యార్థులు పోవద్దు అని విపులంగా అర్ధమయ్యే రీతిగా వివరించి నారు,ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గురుకులం స్కూలు ఉపాధ్యాయుడు శెటికం వెంకటేశ్వరరావు, వివిధ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనినారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షణలో నిర్వహించుట జరిగినది వచ్చిన అతిధులకు కృతజ్ఞతలు తెలియపరిచినారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నాలుగు,ఐదు తరగతుల వారికి నిర్వహించుట జరిగినది ఈ కార్యక్రమంలో హాజరైన విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వడం జరిగినది.