లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయి.. రాష్ట్ర మంత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏపీ లోకాయుక్త సంస్థ, ఏపీ మానవ హక్కుల కమిషన్ (హెచ్.ఆర్.సీ) కర్నూలులోనే ఉంటాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో మంత్రి టి.జి భరత్ మాట్లాడారు. కర్నూలులో ఇప్పటికే నెలకొల్పిన సంస్థలు ఏవీ కర్నూలు నుండి తరలించబోమని తెలిపారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థలన్నీ కర్నూల్లోనే ఉంటాయని ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ప్రజలెవ్వరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నానన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కర్నూలు అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధితో పాటు కర్నూలును అన్ని రంగాల్లో ముందుంచేందుకు తాను ఎంతో కృషి చేస్తున్నానని మంత్రి చెప్పారు.