అంగన్వాడి కేంద్రాలలో ..ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు పిల్లలకు స్క్రీనింగ్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి L.భాస్కర్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము ద్వారా పిల్లలను తల నుంచి పాదం వరకు స్క్రీనింగ్ చేసే కార్యక్రమాన్ని గౌరవనీయ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ, సత్య కుమార్ యాదవ్ 15-11-2024 న ప్రారంభించినారు. 4D (Defects,Diseases, Deficiencies,Development delay) ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు అంగన్వాడి కేంద్రాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని,ఈ కార్యక్రమములో బాగంగా అంగన్వాడి కేంద్రాలలో ప్రతి శనివారము, పాఠశాలలలో ప్రతి గురువారము మరియు శనివారము జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అంగన్వాడి కేంద్రాలలో,పాఠశాలలలో జరుగుతుందని మరియు ఈ కార్యక్రమం విద్య , స్రీ శిశు సంక్షేమ ,గిరిజన సంక్షేమ మరియు సాంఘిక సంక్షేమ శాఖల సమన్వయంతో వారంలో రెండు రోజులు 30 – 50 మంది పిల్లలను స్క్రీనింగ్ చేయడానికి రూపొందించిన సూక్ష్మ ప్రణాళికల ఆధారంగా అమలు అవుతుందని , ఈ స్క్రీనింగ్ కార్యక్రమము 16-11-2024న షెడ్యుల్డ్ ప్రకారం ప్రారంభం అవుతుంది అని తెలిపారు.