బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా జనసేన నాయకుడు తోళ్ల మంజునాథ్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గురువారం ప్రకటించిన పలు డైరెక్టర్ల నియామక జాబితాలో కర్నూలు జిల్లా నుండి జనసేన కి స్థానం దక్కింది వాల్మీకి రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్ గా పాణ్యం నియోజకవర్గానికి చెందిన తోళ్ల మంజునాథ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనికి వారు హర్షం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ తన సేవలను గుర్తించి బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు కి, మంజునాథ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు శుక్రవారం కర్నూల్ నగరం స్థానిక బిర్లా కాంపౌండ్ జనసేన కార్యాలయంలో మంజునాథ్ కి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PBV సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.