దేశ ప్రగతిలో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి
1 min readజిల్లా సహకార అధికారి ఎ.శ్రీనివాస్
సహకార సంఘాలు లాభపేక్ష లేకుండా ప్రజలకు సేవలందిస్తున్నారు
రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా విస్తృత సేవలు
సహకార వారోత్సవాలు ఇంచార్జ్..ఆర్ శ్రీనివాసరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దేశ ప్రగతిలో సహకార సంఘాల ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని జిల్లా సహకార అధికారి ఏ శ్రీనివాస్ అఖిలభారత సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆవరణలో శుక్రవారం జిల్లా సహకార అధికారి ఏ శ్రీనివాస్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సహకార సంఘాలు లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందిస్తున్నాయన్నారు. రైతులకు రుణాలు అందించడం, ఎరువులు, విత్తనాలు నుండి పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం వంటి ఎన్నో సేవలందిస్తున్నాయన్నారు. ఏలూరు జిల్లాలో డిసిఎంఎస్ ద్వారా రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే అందిస్తున్నారన్నారు. వికసిత్ భారత్ నిర్మాణములో సహకార సంఘాల పాత్ర గురించి తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార రంగ సంస్కరణల గురించి విపులముగా వివరించారు. ఉన్నతమైన వ్యవస్థగా రూపుదిద్దుకొనుటకు సిబ్బంది పని చేయాలని కోరారు. సహకార వారోత్సవాలు ఇన్చార్జి ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సహకార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి రోజువారి అంశముల గురించి రాబోవు రోజుల్లో గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా విస్తృతమైన సేవలు అందించుటకు సహకార సంఘాలకు అవకాశము వచ్చిందన్నారు. బిజినెస్ మేనేజర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ తమ మార్కెటింగ్ సంస్థ ద్వారా చేయుచున్న వ్యాపారాల లావాదేవీలు సంఘ ప్రగతి గురించి తెలిపి ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారులు ఎం నరసింహారాజు, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్, ఏ కె ఎన్ మూర్తి మరియు మార్కెటింగ్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.