కార్యకర్తల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్న ఘనత టిడిపి పార్టీదే
1 min readఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
రాష్ట్రం 30 ఏళ్ళ అభివృద్ధిలో వెనుకబడిపోయింది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : నిడమర్రు, గణపవరంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తో కలిసి ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా కార్యకర్తల సంక్షేమానికి పథకాల అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. నిడమర్రు, గణపవరంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు. గణపవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యకర్తలు , నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్ వైఫల్యాలు కారణంగా రాష్ట్రం 30 ఏళ్లు అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ఎంపీ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారులోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రాబట్టారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. తాను ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఎంపీ వెల్లడించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకు అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని, త్వరలోనే ఆయనకు మంచి పదవి రాబోతుందని ఎంపీ తెలిపారు. నిడమర్రు, గణపవరం పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు ఎంపీ మహేష్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.