లాభాల బాటలో ఎంఐసి ఎలక్ట్రానిక్స్
1 min readత్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ఎంఐసి
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 532850, ఎన్ఎస్ఈ: ఎంఐసిఈఎల్) తన క్యూ2FY25 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 30 సెప్టెంబర్ 2024తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 156.26% వృద్ధి సాధించి రూ. 2745.67 లక్షలుగా నమోదైంది. ఎబిటా 37.56% QoQ వృద్ధి చెంది రూ. 286.86 లక్షలు చేరింది. ఎబిటా మార్జిన్లు క్యూ1ఎఫ్ వై 25లో 2.79% నుంచి క్యూ2 ఎఫ్ వై 25లో 13.97%కి పెరిగాయి. పిఏటి కూడా 8.18% QoQ వృద్ధి చెంది రూ. 212.59 లక్షలుగా ఉంది.కంపెనీ కొత్తగా “మిక్ డిజిటల్ ఇండియా లిమిటెడ్” అనే పూర్తిగా అనుబంధ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ స్మార్ట్ మీటర్లు, డిజిటల్ మీటర్లు, రూఫ్ మౌంటెడ్ ఏసి ప్యాకేజీ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ పవర్ సప్లై సిస్టమ్స్ వంటి పరికరాల తయారీకి సమర్పితమై ఉంటుంది.ఇటీవల, బోర్డు శ్రీ పెనుమాక వెంకట రమేష్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా 5 సంవత్సరాల కాలానికి నియమించేందుకు ఆమోదించింది. ఆయనకు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, కార్పొరేట్ రంగాల్లో 40 సంవత్సరాల విశేష అనుభవం ఉంది.కంపెనీ రైల్వే ప్రాజెక్టుల కోసం సేలం మరియు రత్లామ్ డివిజన్ల నుంచి రెండు కీలక ఒప్పందాలను పొందింది. క్యూ1ఎఫ్ వై 25లో కూడా ఎంఐసి తన ఆదాయాన్ని రూ. 1071.46 లక్షల వరకు పెంచి, 53% వృద్ధి సాధించడంతో పాటు పిఏటిలో 59% వృద్ధి నమోదు చేసింది.ఎంఐసి ఎలక్ట్రానిక్స్ ఎల్ డి డిస్‌ప్లేలు, టెలికం ఉత్పత్తులు, మరియు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధిలో ప్రపంచ నేతగా స్థిరపడింది.