స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ – రూ. 60 కోట్ల నిధులు సమీకరణం
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 511700), ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్ బి ఎఫ్ సి), బోర్డు ఆమోదంతో 6,000 అన్‌రేటెడ్, అన్‌లిస్టెడ్, సెక్యూర్డ్ ఎన్ సి డిలను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో జారీ చేసి, మొత్తం రూ. 60 కోట్లను సమీకరించినట్లు ప్రకటించింది.ఇటీవల, 7,000 అన్‌రేటెడ్, అన్‌లిస్టెడ్, సెక్యూర్డ్ ఎన్ సి డిలను జారీచేసి రూ. 70 కోట్ల నిధులను సేకరించినట్లు తెలిపింది. అదనంగా, సంస్థ బోర్డు రూ. 500 కోట్ల విలువైన 50,000 సెక్యూర్డ్, అన్‌లిస్టెడ్, అన్‌రేటెడ్, రిడీమబుల్ ఎన్ సి డిలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతలుగా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా జారీ చేయడానికి ఆమోదం తెలిపింది.సంస్థ విద్యాసంస్థల కోసం జీరో-కాస్ట్ ఇఎంఐ స్కీమ్ను ప్రారంభించింది, దీనిద్వారా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్ పిఎస్)ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ కార్యక్రమం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక టెక్నాలజీ ఆధారిత చదువు పద్ధతులను అందిస్తుంది.ఐఎఫ్ పిఎస్ ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాలలు సాధారణ ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలాగే, చాక్ పొడితో కలిగే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గించి ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణాన్ని కల్పించవచ్చు.గౌరవ్ జిందాల్, మేనేజింగ్ డైరెక్టర్, క్విక్‌టచ్, మాట్లాడుతూ, “డిజిటల్ మార్పు విద్యాభవిష్యత్తు. ఐఎఫ్ పిఎస్ ఆ మార్పుకు కీలక భాగం. మా జీరో-కాస్ట్ ఇఎంఐ స్కీమ్ ద్వారా పాఠశాలలు ఆర్థిక ఒత్తిడి లేకుండా ఈ టెక్నాలజీని స్వీకరించవచ్చు. ఇది విద్యారంగానికే కాకుండా సమాజానికి కూడా లాభదాయకం” అని తెలిపారు.స్టాండర్డ్ క్యాపిటల్ ఈ ఆర్థిక కార్యక్రమానికి ₹100 కోట్లను కేటాయించి, షేర్‌హోల్డర్లకు ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక ప్రభావం కల్పించడంపై దృష్టి పెట్టింది.ఈ కార్యక్రమం సంస్థ లక్ష్యానికి అనుగుణంగా ఉండి, విద్యా రంగం అభివృద్ధికి తోడ్పడేలా రూపుదిద్దుకుంది.