ఎస్ఎంసి విద్యాసంస్థల అనుబంధంగా హాస్పిటల్ ప్రారంభోత్సవం
1 min readఅన్ని వర్గాల వారికి విద్యతో వైద్య సేవలులు మా లక్ష్యం
అత్యాధునిక సౌకర్యాలతో హాస్పటల్ నిర్మాణం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదవేగి మండలంలో ఎస్ ఎం సి విద్యా సంస్థల యాజమాన్యం నిరు పేదలకు నాణ్యమైన విద్యా నందిస్తూ మెరుగైన వైద్య సేవలందించేందుకుమరో అడుగు ముందుకేసింది,సమాజం లో బడుగు బలహీన వర్గాల తో బాటు సామాన్య,మధ్యతరగతి వర్గాల విద్యార్దులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ను ఇప్పటికే అందిస్తూ జిల్లాలో ఉత్తమ ఫలితాలను అందించే ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా ఎస్ ఎం సి స్కూల్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది,విద్యతో బాటు వైద్య పరంగా కూడా సేవలందించాలని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ నిర్మించింది,ఈ హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించి సమాజ సేవకు పునరంకితం అవ్వాలని ఎస్ ఎం సి విద్యా సంస్థల యాజ మాన్యం హాస్పిటల్ ను కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది ,త్వరలో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి శరవేగంగా అడుగులు వేస్తుంది, సామాన్యులకు మెరు గైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం గా విద్య వైద్య సంస్థల పౌండ ర్ ఛైర్మెన్, ఫాదర్ డొమినిక్ చుక్కా,కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ అవినాష్ రాజ్ చుక్కా, హాస్పిటల్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ పావని చుక్కా అహర్నిశలూ కృషి చేయడం అభినందనీయం,ఈ హాస్పిటల్ లో ప్రముఖ గైనకాలజి సర్జన్ డాక్టర్తాన్యారాజ్ నేతృత్వం లో జనరల్ సర్జరీ,లాఫ్రో స్కొపీక్ సర్జరీ,ఆర్దో పెడిక్ సర్జరీ, న్యూ రాలజి,స్పెషలిస్ట్ వైద్యులు ఆధునిక వైద్య సేవలందించ నున్నారు,ఈ హాస్పిటల్ లో ఎక్సరే ,ఈ సి జీ ,రక్త పరీక్షా కేంద్రం ,ఫార్మసీ,వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి,ఇటువంటి అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే హాస్పిటల్ ను ఎస్ ఎం సి విద్యా సంస్థ ల యాజమాన్యం నెల కొల్పడం పెదవేగి మండల కేంద్రానికి మణిహారం, మారు మూల గ్రామీణ ప్రాంతాల బడుగు బలహీనర్గాల ప్రజల ఎస్ ఎం సి సంస్థల యాజమాన్యం అందించే వరం అని చెప్ప వచ్చు,మరో కొద్ది రోజుల్లో అఖలాండ బ్రహ్మాండ కోటి మిషనరీ, రాజకీయ, అతిరధ మహారథుల చేతుల మీదగా అంగరంగ వైభోగంగా ప్రారంభం కానున్న ఈ ఎస్ ఏం సి హాస్పిటల్ ప్రారంభోత్స కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఒక ప్రకటనలో తెలిపారు.