ప్రజా ప్రతినిధులకు అధికారులకు శిక్షణ..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది.మిడుతూరు మండల పరిషత్ సమావేశ కార్యాలయంలో శనివారం 2025-26 సం.కి గాను గ్రామాల అభివృద్ధి చేయుట గురించి ఎంపీడీఓ పి దశరథ రామయ్య,ఈఓఆర్డి సంజన్న, పంచాయతీరాజ్ ఏఈ ప్రతాప్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శులు ఎన్ అనురాధ,పవన్ కుమార్ శిక్షణ ఇచ్చారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఒక ప్రణాళిక బద్దంగా గ్రామ స్థాయిలో అవసరమైన త్రాగునీరు పారిశుద్ధ్యం మౌలిక వసతులు విద్య వైద్యం అనే అంశాల పనులను చేపట్టు టకు ఈ ప్రణాలిక ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఒక దానిని ఎంచుకొని ఆ దిశలో అభివృద్ధిని సాధించే విధంగా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ గ్రామసభల నిర్వహణలో భాగంగా గ్రామాల అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే వాటి గురించి వారు శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు వరలక్ష్మి రేణుకాదేవి,ఎంపీటీసీలు సర్పంచులు,డిజిటల్ అసిస్టెంట్లు,గ్రామైఖ్య సంఘ పొదుపు మహిళలు పాల్గొన్నారు.