విధుల్లో తీవ్ర అలసత్వం వహించిన 5 గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
1 min readజిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: డోన్ మండలం కొత్త బురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన ఐదు మంది వైద్య సిబ్బందిపై సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజ కుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 16వ తేదీన డోన్ మండలం కొత్త బురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన సి.నీలిమ, ఎఫ్ఎన్ఓ, మరియు డి. నాగరాజు, తోటిలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఎలాంటి సెలవు, ముందస్తు అనుమతి, చెప్పా పెట్టకుండా విధులు బహిష్కరించిన ఎం.అన్నపూర్ణ, స్టాఫ్ నర్సు, బి.రేఖ, ఫార్మసిస్ట్, గ్రేడ్ -II, ఎం.శంకరమ్మ, సీనియర్ అసిస్టెంట్ మొత్తం ఐదు మంది వైద్య ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.