పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొన్న ఎం.పి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో అధ్యయన పర్యటన నిర్వహించింది.. రెండు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో స్టాండింగ్ కమిటీ సభ్యుడైన కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.. పర్యటనలో భాగంగా స్టాండింగ్ కమిటీ చైర్మన్ కనిమొళి తో కలిసి కమిటీ సభ్యులు ప్రముఖ బ్యాంకుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.. సమావేశంలో భాగంగా బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల హక్కులను రక్షించడం , అన్యాయమైన విధానాల నుండి ప్రజలను మేల్కొల్పడం, వారి హక్కులను కాపాడడం పై చర్చించారు..అనంతరం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమై ఆహార గోడౌన్లలో ఆహార ధాన్యాల వృధా నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం తో పాటు నేషనల్ టెస్టింగ్ హౌస్ (ఎన్. టి.హెచ్ ) ని సందర్శించి, వినియోగదారుల కు నాణ్యతా ప్రమాణాలు ఉండేలా పరీక్ష సౌకర్యాలను పరిశీలించారు.. పర్యటన లో భాగంగా ఎం.పి నాగరాజు కమిటీ సభ్యులతో కలిసి జైపూర్ లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.