టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) పై పోలీసులు అవగాహన పెంచుకోవాలి.. ఎస్పీ
1 min readపోలీసు శిక్షణా కేంద్రంలో సైబర్ నేరాల కట్టడి , డ్రోన్ టెక్నాలజీ పై శిక్షణ కార్యక్రమం… జిల్లా ఎస్పీ.
డ్రోన్ కెమెరాలు ఉపయోగించే పనితీరు సామర్ధ్యాన్ని పరిశీలించిన… జిల్లా ఎస్పీ.
400 మంది పోలీసులను డ్రోన్ ఆపరేటర్స్ గా తీర్చిదిద్దే విధంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం… జిల్లా ఎస్పీ.
ముఖ్య ఉద్దేశ్యం … డ్రోన్ కెమెరాల వినియోగంలో నిష్ణాతుల
కర్నూలు పోలీసులు టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపీఎస్తెలిపారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: డ్రోన్ కెమెరాలు ఎగురవేసి ఉపయోగించే పనితీరు సామర్థ్యాన్ని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు, దిన్నేదేవరపాడు దగ్గర గల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో డ్రోన్ టెక్నాలజీ పై , సైబర్ నేరాల టెక్నాలజీ పై 2 రోజుల పాటు 21 మంది పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ టెక్నాలజీ , సైబర్ నేరాల టెక్నాలజీ పై శిక్షణ తీసుకుంటున్న పోలీసులతో సమావేశమై మాట్లాడారు. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 400 మంది ని డ్రోన్ ఆపరేటర్స్ గా తీర్చిదిద్దే విధంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు.జన సముహాం, ఊరేగింపులు, పండుగలు , పగలు గస్తీ , ఉత్సవాలలో డ్రోన్ కెమెరా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు.శాంతి భద్రతలు కాపాడడంలో డ్రోన్ కెమెరాల వినియోగం ను చాలా కీలకం చేస్తామన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం… డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ కెమెరాలను ఎగురవేసే సామర్థ్యంలో జిల్లా పోలీసులను నిష్ణాతులను చేసే ఉద్దేశ్యంతో ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ లో 4 గురికి తక్కువగా కాకుండా డ్రోన్ ఎగురవేసే సామర్థ్యాన్ని , డ్రోన్ టెక్నాలజీ పై అవగాహన తెచ్చేవిధంగా వారిని తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రసాద్, అబ్దుల్ గౌస్, డిటిసి సిఐ గౌతమి, సైబర్ ల్యాబ్ సి ఐ వేణుగోపాల్ , టెక్నికల్ టీం మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.