PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఇందిరాగాంధీ  107వ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : భారతదేశ మహిళా మణిరత్నం శ్రీమతి ఇందిరాగాంధీ  107వ జయంతి కార్యక్రమం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాలు ప్రకారం ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎం అమానుల్లా ఆధ్వర్యంలో జరపడం జరిగింది .కాంగ్రెస్ పార్టీహొళగుంద  మండలం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అమానుల్లా మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ  ఏకైక కుమార్తె ఇందిరాగాంధీ. ఈమె  నవంబర్ 19. 1917 అలహాబాద్ లోని ఆనంద భవన్ లో జన్మించింది. ఆధునిక ప్రపంచ భారత దేశ ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన రెండవ మణి శ్రీమతి ఇందిరాగాంధీ . శ్రీమతి ఇందిరా గాంధీ  ఒకటిన్నర దశాబ్దం పాటు భారతదేశానికి ప్రధాని ఉండి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజాదరణ పొందారు.మొదటిసారిగా 14 బ్యాంకులను 1969 లో జాతీయం చేయడం జరిగింది.1970లో రాజాభరణాలను రద్దు చేయడం జరిగింది. 1971లో గరీబీ హటావో అనే నినాదాన్ని ప్రవేశపెట్టారు.1971 లో భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళా మూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ .1984లో అక్టోబర్ 31న తన ప్రాణాలను కాపాడడానికి నియమించబడ్డ అంగరక్షకులే ఆమెను దారుణంగా ఆమె ప్రాణం తీశారు దేశ సేవ కోసమే ప్రాణాలు అర్పించిన మహా మాతృమూర్తికి హృదయపూర్వక శతకోటి నమస్తు మంజలి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చాకలి మంగయ్య, బోయ సిద్ధప్ప, ఖాజా హుస్సేన్ పీర్ సాబ్, సిద్ధిక్ సాబ్,  బాబు సాబ్ ,బసవన గౌడ, అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *