లోకాయుక్త, హెచ్ఆర్సీ లను తరలించవద్దు ..
1 min readబార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి
మూడు రోజులపాటు న్యాయవాదుల విధుల బహిష్కరణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలులో ఉన్న లోకాయుక్త, జాతీయ మానవహక్కుల కమిషన్(హెచ్ ఆర్ సీ) కార్యాలయాలతో పాటు వక్స్ ట్రిబ్యునల్ లను అమరావతికి తరలించే ప్రయత్నాలను రాష్ర్టప్రభుత్వం విరమించు కోవాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.రంగస్వామి, ప్రధాన కార్యదర్శి హెచ్ మహేశ్, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, కారప్ప, సత్యనారాయణ, అవుల శేఖర్, సురేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం గత ప్రభుత్వం కర్నూలులో ఏర్పాటు చేసిన లోకాయుక్త, జాతీయ మానవ హక్కుల కమిషన్ తోపాటు వక్ఫ్ ట్రిబ్యునల్ లను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి తరలించడం సబబు కాదన్నారు. ఎన్నికల ముందు అధికారం లోకి వస్తే కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన హామీ అమలు చేయక పోగా, ఇప్పుడు కర్నూలులో ఉన్న కార్యాలయాలను కూడా అమరావతికి తరలిస్తే రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కర్నూలు లో ఏర్పాటు చేసిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ తో పాటు వక్ఫ్ ట్రిబ్యునల్ లను అమరావతికి తరలించవద్దని కర్నూలు,అనంతపురం జిల్లాల బార్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించాలని తీర్మానాలు చేశారన్నారు. అదేవిధంగా పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి 22వరకు మూడు రోజులపాటు విధులు బహిష్కరిస్తున్నామని, వివిధ రూపాలలో నిరసనలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవి.