వాతావరణ కాలుష్యం …పర్యావరణ పరిరక్షణ
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: వాతావరణ కాలుష్యం పర్యావరణ పరిరక్షణ అనే అంశానికి సంబంధించి చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఇస్లాంపేట నందు పాఠశాల యాజమాన్యం వారి ఆధ్వర్యంలో జరిగిన చిత్ర లేఖన పోటీలలో 9 వ తరగతి కి చెందిన G.షాకీరా ప్రథమ బహుమతి, 10 వ తరగతి కి చెందిన S.రియాజ్ ద్వితీయ బహుమతి మరియు 9 వ తరగతి కి చెందిన S.అబ్దుల్ ఆదిల్ తృతీయ బహుమతులను సాధించడం జరిగినది. ఆ బహుమతులను పాఠశాల కరెస్పాండెంట్ A.తాజుద్దీన్ చేతుల మీదుగా విద్యార్థులు అందుకొని ఆనంద వ్యక్త పరిచినారు.ఈ కార్యక్రమం సందర్బంగా కరెస్పాండెంట్ A.తాజుద్దీన్ బహుమతులు అందుకున్న విద్యార్థులను ప్రశంసిస్తూ విద్యార్థులలో విద్యతో పాటు చిత్రాలేఖనలోను, క్రీడాలలోనూ, టైక్వాండ్ లలోనూ నైపుణ్యంను సాధించడం ఈ రోజులలో చాలా అవసరమని విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగినది. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే విద్యా పరంగా పోటీతత్వం ఏర్పరచుకొని లక్ష్యంను సాధించడం వలన దేశాభివృద్ధి జరుగుతుంది. కావున ప్రతి విద్యార్థి వద్ద ఏదో ఒక రూపంలో ఒక టాలెంట్ ఉంటుంది దానిని తగిన సమయంలో వినియోగించి దేశాభివృద్ధి కి తోడ్పాటు అందిచవలసిఉంటుందన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమం నందు విద్యార్థులతో పాటు న్యామతుల్లా, అశ్వక్, మహబూబ్, నూర్, మహమ్మద్ బేగ్, సాజిదా, ఫర్జానా, జుబేరియా, ఆసియా, అఫ్రిన్ మొదలగు ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని బృందం పాల్గొనడం జరిగినది.