గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి కానీ- గొడవలకు కక్ష సాధింపులకు పోకూడదు
1 min readకొత్త గాంధీ నగర్ దళితులకు సీఐ కౌన్సిలింగ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు- గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఒకరికి ఒకరు అన్నదమ్ములవలే మెలగాలని అలా కాకుండా గొడవలకు, కక్ష సాధింపులకు పోతే జీవితాలు నాశనం అవుతాయని సీఐ పురుషోత్తం రాజు తెలిపారు. చెన్నూరు కొత్త గాంధీ నగర్ లో గురువారం సాయంత్రం అక్కడ ఉన్న విద్యార్థులకు, గ్రామస్తులకు ఆయన అవగాహన కల్పించారు. దళితులు ఒకరికి ఒకరు సమన్వయంతో పనులు చేసుకుంటూ జీవించాలే తప్ప, కక్ష సాధింపులకు పోతే జీవిత మనుగడ దారి తప్పుతుందని తద్వారా కుటుంబాలు నాశనం అవుతాయని ఆయన వారికి తెలిపారు. విద్యార్థులు చదువు మీద దృష్టి సారించి ఉన్న ఊరికి, కన్నవారికి పేరు తెచ్చే విధంగా చదువుకోవాలి తప్ప, మద్యానికి, గంజాయికి, ఇతర వ్యసనాలకు గొడవలకు, పోరాదని ఆయన వారిని హెచ్చరించారు. మన కుటుంబాలు అంతంత మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు. ఇష్టపడి చదివి మంచి మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆయన వారికి తెలిపారు. కొత్త గాంధీ నగర్ లో అందరూ దళితులు కాబట్టి ఒకరికి ఒకరు కలిసిమెలిసి ఉండాలే తప్ప, ఇతరత్రా వాగ్వాదాలకు వెళ్లకూడదని తెలిపారు. విద్యార్థుల పైన ఒకసారికేసు నమోదు జీవితాలు సర్వనాశనం అవుతాయని, భవిష్యత్తులో ఎప్పటికీ ఉద్యోగాలు రావని విద్యార్థులు సత్ప్రవర్తన తో మెలిగి తమ ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని ఆయన విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. గ్రామాలలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించే విధంగా పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలా కాకుండా మీలో మీరు గొడవపడి జీవితాలు నాశనం చేసుకోకూడదని అక్కడ ఉన్న దళితులందరికీ ఆయన అవగాహన కల్పించడం జరిగింది. సీఐ పురుషోత్తం రాజు చెబుతున్న మంచి మాటలకు దళితులు, విద్యార్థులు ఆకర్షితులై ఎన్నటికీ చెడు వ్యసనాలజోలికి వెళ్ళమని అందరం కలిసికట్టుగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య. గ్రామస్తులు పాల్గొన్నారు.