24న బోయ వాల్మీకి కార్తికమాస వనభోజన మహోత్సవాన్ని జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు నియోజకవర్గ శ్రీ.బెళ్ళుగుండు శ్రీ.ఆంజనేయస్వామి దేవాలయం నందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జరిగే బోయ వాల్మీకి కార్తికమాస వనభోజన మహా ఉత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.ఈ రోజు చిప్పగిరి, ఆస్పరి మండలం వాల్మీకీ సహోదరలను కలిసి బోయ వాల్మీకి కార్తీక మాస వనభోజన మహోత్సవ ఆహ్వానం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ మాట్లాడుతూ. ఆలూరు నియోజకవర్గంలో బోయ వాల్మీకి కార్తీకమాస వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చిప్పగిరి, ఆస్పరి మండల చుట్టుపక్కల గ్రామాల్లో బోయ వాల్మీకి పెద్దలు యువకులు మహిళలు అందరు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు._ఈ కార్యక్రమంలో APVBS ఆలూరు నియోజకవర్గం అధ్యక్షులు డి.నాగేష్,యువనాయకులు సురేంద్ర, చిరుమాన్ దొడ్డి రాజ్ కుమార్, ఆస్పరి మండల అధ్యక్షుడు మహేష్,నాగేంద్ర,యూత్ వింగ్ అధ్యక్షుడు హుళేబీడు వీరేష్,ఆస్పరి మండల కార్యదర్శి ఓబులేష్, యువనాయకులు తదితర వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.