PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రేడ్ 3 ఏఎన్ఎం లకు పని భారంతో పాటు ఒత్తిడి

1 min read

లిఖితపూర్వకంగా ఎంపీడీవోకి వినతి

సానుకూలంగా స్పందించిన ఎంపీడీవో శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదవేగి మండలం లో సచివా లయాల్లో విధులు నిర్వహించేగ్రేడ్ 3 ఏ ఎన్ ఎం లు విధులు పరంగా ఎదుర్కుంటున్న సమస్యల పై పబ్లిక్ హెల్త్ అండ్మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐఎన్ టియు సి )నాయకులు బట్టు విజయ్ వర్ధన్ బాబు స్పందించారు.గ్రేడ్ 3 ఏ ఎన్ ఎం లు ఎదుర్కుంటున్న సమస్యలను వివరిస్తూ లిఖిత పూర్వక వినతి పత్రాన్ని పెదవేగి ఏం పీ డీ ఓ.  పి శ్రీనివాస్ కి శుక్రవారం అందజేశారు,పెదవేగి మండలం లో సచి వాలయాల లో గ్రేడ్3 ఏ ఎన్ ఎం లు గా విధులు నిర్వహిస్తున్న వారి తోవైద్య ఆరోగ్య శాఖకు సంబంధం లేని విధులు అప్పగిస్తున్నారని అందువల్లవైద్య సిబ్బంది విధుల పరంగా మానసిక శారీరక వత్తిడులకుగురవుతున్నారని విజయ్ వర్ధన్ బాబు ఎం పీ డీ ఓ శ్రీనివాస్ కి వివరించారు,2019నుండి గ్రామ వార్డ్ స చి వాలయాలలోగ్రేడ్ 3 ఏ  ఎన్ ఎం ల కు వైద్య ఆరోగ్య శాఖ ను మాత్ర మే మధర్ డిపార్ట్ మెంట్ గా చూపుతూ  డీ ఎం అండ్ హెచ్ ఓ ఆద్వర్యం లో విలేజ్ హెల్త్ క్లినిక్ ల ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే విధం గా విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్వహణ ల పై  మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాదికారుల కు  డీ డీ ఓ లుగా చెక్ పవర్ ఇచ్చి గ్రేడ్ 3 ఏ ఎన్ ఎం లను విలేజ్ క్లినిక్ లకు అనుసంధానం చేశారని తెలిపారు, ఇలా అను సందానం చేసిన విలేజ్ క్లినిక్ ల పరిధిలోనే గ్రేడ్ 3 ఏ ఎన్ ఎం లు విధులు నిర్వహించాల్సి ఉంది, ఈ విధులుతో  పని భారం ఎక్కువైనా,గ్రేడ్ 3ఏ  ఎన్ ఎం లు ఫ్యామిలీ పిజిషియన్ కాన్సెప్ట్ లో ఫ్యామిలీ డాక్టర్  ప్రోగ్రాంలలో,  104,ఫ్యామిలీ ప్లానింగ్,ఫ్యామిలీ వెల్పేర్, యాంటి నేట ల్ విజిట్ లలో, పోస్ట్ నే టల్ విజట్ లతో బాటు నాలుగు దఫాలుగా పీ ఏంఎస్ ఏ  లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తో బాటు సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి సతమతమై నలిగి పోతున్నారని విజయ్ వర్ధన్ అన్నారు, అంతే  కాదు యూనివర్సల్ ఇమ్యూ నైజేషన్ లో వ్యాధి నిరోధక టీకా ల కార్యక్రమాలు వారం లో రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్ లో పాల్గొంటున్నారని చెప్పారు. ఇవి కాక పల్స్ పోలియో,లేప్రసి,టీ బి,మలేరియా,డెంగ్యూ,చికున్ గున్యా వంటి వ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడుతూ,మరో ప్రక్క కొవిడ్,19 వేరియంట్,ఎన్ సి డి సి డి 2,0 , ఎన్ సి డి సి డి సర్వే 3,0 వంటి వాటి పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మీటింగ్ లకు వెళ్ళవలసి ఉందన్నారు. విధులు పరంగా    ఇటువంటి వత్తిడి తో ఉన్న గ్రేడ్ 3 వైద్య సిబ్బందికి వైద్య శాఖతో సంబంధం లేని విధులు అప్పగించ వద్దని వైద్య శాఖా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా కమీషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ ఫేర్   ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు కు జిల్లా కలక్టర్ కి ఆదేశాలిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను అమలు పరచాలని జి ఓ  నవంబర్ 124,తో బాటు ఇతర జి ఓ  కాపీలను అధికారులకు సమర్పించామని విజయ్ వర్ధన్ బాబు తెలిపారు,ఈ జిఓ  లను పరిశీలించిన పెదవేగి  ఎంపీ డీఓ శ్రీనివాస్ సానుకూలం గా స్పందిస్తూ పెదవేగి మండలం లో వైద్య శాఖలో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్ 3 ఏ ఎన్.ఎమ్  లకు. ఇతర శాఖలకు సంబంధించిన ఎటు వంటి విధులు అప్ప జెప్ప కుండా ఆదేశాలిస్తామని చెప్పారని విజయ్ వర్ధన్ హర్షం వ్యక్తం చేశారు,.ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి వైద్య సిబ్బందికి ఎవరైనా ఇతర విధులు అప్పగిస్తే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని తెలిపిన ఎం పి డిఓ  శ్రీనివాస్ కి  విజయ్ వర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్య క్రమం లో గ్రేడ్ 3 ఏఎన్ ఎం ల  సంఘా నాయకురాలు పల్లి కొండ రాణి, ఎంఎల్. హెచ్ వీ పావని,ఆశా కార్యకర్తలు దుర్గ ,కమురన్నీసా తదితరులు పాల్గొన్నరని ఒక ప్రకటనలో తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *