కేజీబీవీ అవినీతి ప్రిన్సిపాల్ రీ పోస్టింగ్ ను రద్దు చేయాలి…
1 min readవిద్యార్థుల ఆకలి కేకలు అధికారులకు కనిపించవా…..
అక్రమాల కేజీబీవి ప్రిన్సిపాల్ ను తొలగించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తాం….
ఐక్య విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో డీఈవో దిష్టిబొమ్మ దహనం….
పల్లెవెలుగు వెబ్ న్యూస్ ఎమ్మిగనూరు: పట్టణంలో కేజీబీవీ అవినీతి ప్రిన్సిపాల్ ను తొలగించడంలో డిఈఓ, కలెక్టర్ విఫలం చెందారని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు శేఖర్ నాయుడు , మహేంద్ర బాబు, కృష్ణ, వెంకటేష్,ఆఫ్రిద్,నాగరాజు, రఘునాథ్ అన్నారు.శుక్రవారం స్థానిక పట్టణంలో వైస్సార్ సర్కిల్ నందు ఐక్య విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి(డిఈఓ)దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో అవినీతికి పాల్పడిన ప్రిన్సిపల్ కవిత ని గత మూడు నెలల క్రితం ప్రస్తుతం ఉన్న డిఈఓ శ్యాముల్ పాల్ గారు ప్రిన్సిపాల్ కవిత పై విచారణ జరిపి విద్యార్థుల నిధులను దుర్వినియోగం చేసిందని విద్యార్థులకు సరైన భోజనం కల్పించడం లేదని విధుల నుండి తొలగించి పూర్తిగా టర్మినేట్ చేస్తూ గత ఆగస్టు నెల 14వ తేదీన టార్మినేట్ చేయడం జరిగింది. అయితే తిరిగి డీఈఓ శాముల్ పాల్ గారే అక్కడే గత పది రోజుల క్రితం ప్రిన్సిపల్ కవిత కి రీ పోస్టింగ్ ఇవ్వడం ఏంటని విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తున్నామని విద్యార్థుల ఆకలి కేకలు డిఈఓ మరియు విచారణకు వచ్చిన జీసీడిఓ అప్పుడు కనిపించిన కేజీబీవీ ప్రిన్సిపల్ అవినీతి ఇప్పుడెందుకు కనిపించడం లేదో బహిరంగంగా చెప్పాలని ఇలా అవినీతి చేసిన ప్రిన్సిపల్ కు తిరిగి అక్కడే రి పోస్టింగ్ ఇచ్చి వత్తాసు పలకడం ఏంటని విద్యార్థులకు సరైన న్యాయం చేయనటువంటి జీసిడిఓను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని అలాగే ప్రిన్సిపాల్ కవిత రి పోస్టింగు ను రద్దుచేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని లేనిపక్షంలో నిరాహార దీక్షలకు కూడా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తామని తక్షణమే జిల్లా కలెక్టర్,డిఈఓ రీ పోస్టింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సుభాన్,రవితేజ,మోహన్, కార్తీక్,చరణ్,బాషా తదితరులు పాల్గొన్నారు.