తహసిల్దార్ ఎదుట..బైండోవర్ కేసులు నమోదు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నాటు సారాయి అమ్ముతున్న వ్యక్తులను తహసిల్దార్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు.కర్నూలు జిల్లా డిప్యూటీ కమీషనర్ శ్రీదేవి, నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా, మద్యము కేసులు నమోదు అయిన వ్యక్తులు తదుపరి సంబంధిత నేరాలు చేయకుండా వారిని నంద్యాల జిల్లా నందికొట్కూరు తహసిల్దార్ బి.శ్రీనివాసులు ఎదుట శుక్రవారం వారిని పోలీసులు హాజరు పరిచారు. వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. గత వారం రోజులుగా 16 మందిని తహసీల్దార్ వారి ఎదుట హాజరు పరచి బైండోవర్ చేయడం జరిగిందని సంవత్సరం రోజుల్లో నాటుసారా అమ్మినా, తయారుచేసినా,రవాణా చేసినా,మద్యం సీసాలు అమ్మినా ఒక లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతూ ఉందని వారిని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఆబ్కారీ ఎస్ఐ జఫురుల్ల మరియు సిబ్బంది పాల్గొన్నారు.