NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైల్వే కాంట్రాక్టర్ కు జరిమాన

1 min read

మహానంది, న్యూస్ నేడు:  రైల్వే కాంట్రాక్టర్ కు మైనింగ్ అధికారులు జరిమానా విధించినట్లు విశ్వాసనీయ సమాచారం. మండలంలోని అంకిరెడ్డి చెరువు నుండి అక్రమంగా ఎర్రమటి తరలిస్తూ ఉండడంతో మహానంది పోలీసులు దాడులు నిర్వహించి ఎర్ర మట్టి తరలిస్తున్న 6 టిప్పర్లను సీజ్ చేసి మైనింగ్ శాఖకు గత 6 రోజుల క్రితం అప్పగించడం జరిగింది. రైల్వే పనుల్లో భాగంగా నంద్యాల గిద్దలూరు మార్గంలో  డబుల్ ట్రాక్ నిర్మాణం కోసం  అంకిరెడ్డి చెరువు నుండి మట్టిని 4 టిప్పర్ల ద్వారా తరలించడానికి సంబంధిత శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది. కానీ అనధికారికంగా ఆ కాంట్రాక్టర్ మరో ఆరు టిప్పర్లను ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రెవెన్యూ శాఖ వర్గాలు లెక్కల ప్రకారం 4 టిప్పర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయని సమాచారం. పోలీసుల దాడులతో రైల్వే కాంట్రాక్టర్కు జరిమానా విధించారు అన్న విషయం బయటికి పొక్కడం చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తుంది. దాదాపు 3 లక్షల రూపాయలు జరిమాన విధించార లేక ఆ పైనే విధించారు అనేది సంబంధిత అధికారులు బహిర్గత పర్చాల్సి ఉంది. కానీ ఈ విషయం కాంట్రాక్టర్ కానీ అటు మైనింగ్ అధికారులు కానీ బయటికి వెల్లడించకుండా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీజ్ చేసిన వాహనాలు మహానంది పోలీస్ స్టేషన్ ముందు దర్శనమిస్తున్నాయి.

About Author