సిఎంఆర్ బియ్యం వివరాలను రైస్ మిల్లర్స్ సంబంధిత రిజిస్టర్ లో నమోదు చెయ్యాలి
1 min readరూ:182,06 కోట్ల విలువైన79,900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైస్ మిల్లర్స్ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యం వివరాలు సిఎంఆర్ బియ్యం వివరాలను సంబంధిత రిజిస్టర్ లో నమోదు చేసి ఉన్నతాధికారుల తనిఖీల సమయంలో తప్పనిసరిగా చూపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మిల్లర్లను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం ఖరిఫ్ 2024-25 పంట కాలమునకు ధాన్యం సేకరణ తరువాత సిఎంఆర్ బియ్యం పంపిణి తీసుకోవలసిన ముందస్తు చర్యలపై రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడూతూ ఎఫ్ ఆర్ కె అకౌంటును వివరాలను రిజిస్టర్ లో నమోదుచేసి వుంచాలన్నారు. రైస్ మిల్లర్లందరు వారికి వచ్చిన ధాన్యము వివరములను మరియు సిఎంఆర్ బియ్యం వివరములను రిజిష్టరులలో నమోదు చేయించి సీజన్ ముగిసిన తరువాత పౌర సరఫరాల సంస్థ ఏలురు కార్యాలయములో రికన్సేలేషన్ చేయించుకోవాలన్నారు. జిల్లాలో ఇంతవరకు రూ. 182.06 కోట్ల విలువైన 79,900 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10 వేల 628 మంది రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత, కస్టమ్ మిల్లింగ్ ద్వారా కొనుగోలు చేయబడిన ధాన్యమును బియ్యంగా మార్పు చేసి కస్టమ్ మిల్లింగ్ తర్వాత సిఎంఆర్ బియ్యం నిల్వ కోసం బఫర్ గోడౌన్‌కు డెలివరీ చేయాలన్నారు. ఈ వియములో కస్టమ్ మిల్లింగ్ కోసం జిల్లాలో 99 సార్టెక్స్ రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. రైతులు వారు పండించిన ధాన్యము నిర్దారిత నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నచో రైస్ మిల్లర్లు నిర్దారిత అంచనా సమయం లోపు ధాన్యంను దిగుమతి చేసుకోనుటకు అవసరమైన తగు హమాలిలను మరియు ఇతర అవసరమైన అన్ని ఏర్పట్లు ఉండేలా చూచుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రముల వద్ద ధాన్యము కొనుగోలునకు అవసరమైన గోనే సంచులు ముందుగానే రైతు సేవా కేంద్రం ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రమలో పనిచేయు సిబ్బందిచే ధాన్యము కొనుగోలు కొరకు గోనే సంచులు కావలసిదిగా ఇండెంట్ ఇవ్వబడినచో సదరు ఇండెంట్ ప్రకారం గోనే సంచులులు ముందుగానే బాగుచేయించి ఏటువంటి చిరుగులు లేకుండా అందజేయాలన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ (కంట్రోల్ రూమ్ నెంబర్లు 08812-230448, 7702003584, మరియు టోల్ ఫ్రీ 18004256453) ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల సంస్ధ అధికారి ఆర్.ఎస్.ఎస్. రాజు, విజిలెన్స్ సివిల్ సప్లైయి అధికారి దేవకిదేవి, జిల్లాలోని రైస్ మిల్లర్స్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.