PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్యవైశ్యుల‌కు అన్నివిధాలా అండ‌గా ఉంటా.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

1 min read

ఏపీ ఆర్యవైశ్య యువ‌జ‌న సంఘం ప్రమాణ‌స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టి.జి భ‌ర‌త్

వైశ్యులకు స‌మస్య వ‌స్తే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కరిస్తా.. మంత్రి టి.జి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆర్యవైశ్యుల‌కు ఎల్లప్పుడూ అండ‌గా ఉంటాన‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి, అనంత‌పురం జిల్లా ఇంచార్జి మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. అనంత‌పురంలోని కె.టి.ఆర్ క‌న్వెన్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువ‌జన సంఘం ప్రమాణస్వీకారం, అభినంద‌న కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్, ఎమ్మెల్యేలు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వర ప్రసాద్, ఎం.ఎస్. రాజు, ఎంపి అంబికా ల‌క్ష్మీ నారాయ‌ణ‌, ఆర్యవైశ్య పెద్ద‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్యవైశ్య యువ‌జ‌న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూప‌కుంట్ల శ‌బ‌రి వ‌ర ప్రసాద్‌తో పాటు నూత‌న క‌మిటీకి ఆయ‌న ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల‌కు ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా త‌న దృష్టికి తీసుకురావాల‌న్నారు. సీఎం చంద్రబాబుతో చ‌ర్చించి ఆర్యవైశ్యుల స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్య‌వైశ్యుల‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంద‌న్నారు. సీఎం చంద్రబాబు నాయుడు త‌న‌పై న‌మ్మకంతో రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప‌రిశ్రమ‌ల శాఖ‌కు మంత్రిగా చేశార‌ని కొనియాడారు. ఆర్యవైశ్యులలో 95 శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేశార‌న్నారు. త‌మ ప్రభుత్వంపై పెట్టుకున్న న‌మ్మకాన్ని వొమ్ము చేయ‌కుండా తాము ప‌నిచేస్తామ‌న్నారు. దేశ‌, విదేశాల నుండి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు త‌ర‌లివ‌స్తున్నార‌న్నారు. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ వ‌ల్లనే ఇది సాధ్యమ‌వుతుంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వంలో అభివృద్ధికి త‌ప్ప విధ్వంసానికి చోటు లేద‌న్నారు.అనంత‌పురంలో ఆర్యవైశ్యుల స‌త్రం నిర్మాణం కోసం ఇన్చార్జి మంత్రిగా త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు. ప‌రిశ్రమ‌లు పెట్టేవారికి త‌మ ప్రభుత్వం అన్నివిధాలా స‌హ‌కారం అందిస్తుంద‌న్నారు. స్థానికంగా పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలన్నారు. ఇక ఆర్య‌వైశ్యులకు త‌న తండ్రి టి.జి వెంక‌టేష్ అన్ని విధాలా అండ‌గా ఉండి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తాను ప్ర‌భుత్వం త‌రుపున ఎలాంటి స‌హ‌కారం కావాల‌న్నా అందిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. నూత‌న క‌మిటీ స‌భ్యులు చురుకుగా ప‌నిచేయాల‌న్నారు. ఈ కార్య్రమంలో ఆర్యవైశ్య మహాసభ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *