ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం మైనారిటీ నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ని మాధవి నగర్ నివాసం నందు ఓర్వకల్లు మండలo నన్నూరు గ్రామం ముస్లిం మైనారిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి గ్రామం లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం తో (ఖబరస్థాన్)స్మశాన వాటిక స్థలo సరిపోవలేకపోవడం తో నూతన (ఖబరస్థాన్) స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని మరియు కాంపౌండ్ వాల్ నిర్మించాలని, ఎమ్మెల్యే ని ముస్లిం మైనారిటీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు విశ్వేశ్వర రెడ్డి,గ్రామ మైనారిటీ నాయకులు ఖాజా మియ,శంశుద్ధిన్,సర్దార్ ఖాన్,వలి బేగ్,సర్కార్,హమీద్ బెగ్,తదితరులు పాల్గొన్నారు.