కష్టపడిన వారిని సీఎం చంద్రబాబు గుర్తిస్తారు.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min readకుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పార్టీలో కష్టపడిన వారికి సీఎం చంద్రబాబు నాయుడు తగిన గుర్తింపు ఇస్తారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ఎం.ఆర్.సి కన్వెన్షన్ హాలులో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి టి.జి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితులు ఉండేవన్నారు. అలాంటి సమయంలో కూడా ప్రజల తరుపున ధైర్యంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారని మంత్రి అన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమిశెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు కుడా ఛైర్మన్గా సోమిశెట్టిని ఎంపిక చేశారని మంత్రి టి.జి భరత్ అన్నారు.