కన్నుల పండువగా గంగపుత్రుల వన భోజన మహోత్సవం
1 min readగంగపుత్రులు అన్ని రంగాల్లో రాణించాలి.
గంగపుత్ర సంఘం అధ్యక్షులు హండే శాంతయ్య.
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు హండే హం శాంతయ్య ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్తీక వన భోజన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ముందుగా తుంగభద్ర నది తీరం లో వెలసిన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గంగమ్మ గుడి వద్ద నుంచి ఎంటీఆర్ సర్కిల్, ప్రధాన రహదారి, రాఘవేంద్ర సర్కిల్, జాతీయ రహదారి మీదుగా గ్రామ శివారులోని అభయాంజనేయం విగ్రహం వెనుక ఉన్న ఉసిరి వనం వరకు ప్రత్యేక వాహనంలో గంగమ్మమాత, భీష్మ మహర్షి చిత్రపటాలను కొలువుంచి ఉరేగింపు నిర్వహించారు. ఉరేగింపు కార్యక్రమంలో మహిళలు, యువతులు కళాశాలతో ఉరేగింపు రాగా, యువకులు డప్పు, డ్రమ్స్ మోతల మధ్య ప్రారంభమై ఉసిరి వనంలో ఉసిరి చెట్టు కు మహిళలు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం ఉసిరి వనంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం లో అధ్యక్షులు శాంతయ్య మాట్లాడుతూ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల వారి అశిస్సులతో గంగపుత్రులు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం వచ్చిన వారికి వనభోజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, బొంబాయి శివ, వట్టేప్ప సుంకప్ప, హండే హనుమంతు, సున్నం రామయ్య, బేల్దారు నాగప్ప, బంగి భీమయ్య, బంగి దుళ్లయ్య, వట్టేప్ప నర్సింహ, సున్నం రామకృష్ణ, సంత మార్కెట్ పాఠశాల ఛైర్మెన్ గురురాజ,బొంబాయి నరసింహులు, రవి గంగపుత్రుల సంఘం నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.