బాధ్యతలు చేపట్టిన మిడుతూరు ఎంఈఓ..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు ఇన్చార్జి మండల విద్యాశాఖ అధికారిగా ఎస్.రామిరెడ్డి ని నియమిస్తూ కడప రీజినల్ డైరెక్టర్ శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు.ఉత్తర్వులు వచ్చిన వెంటనే నందికొట్కూరు గాంధీ మెమోరియల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం రామిరెడ్డి ఇన్చార్జి ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ పనిచేస్తున్న ఎంఈఓ ఫైజున్నిసా బేగం వైద్య కారణాల రీత్యా డిసెంబర్ 19 వరకు ఆమె సెలవు పెట్టారు. అదేవిధంగా గడివేముల ఎంఈఓ గా ఉన్న విమల ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తూ ఉండడంతో ఇక్కడ ఇన్చార్జి ఎంఈఓ గా గని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానో పాధ్యాయులు శ్రీధర్ రెడ్డిని ఇన్చార్జి ఎంఈఓ గా నియమిస్తూ ఆర్జెడీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు.