ఏలూరు జిల్లాలో ఘనంగా అండర్ -15 చెస్ ఫెస్టివల్
1 min readవిజేతలకు బహుమతులు అందజేత
విద్యార్థిని విద్యార్థులు చెస్ ద్వారా మేధాశక్తి ని పెంపొందించుకోవచ్చు
సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ కె బద్రి
పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక శనివరపుపేట శాతవాహన నగర్ బాలాజీ రెసిడెన్సి లో ఏలూరు జిల్లా అండర్ -15 చెస్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కె బద్రి మాట్లాడుతూ చదరంగం పిల్లలలో మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచుతుందని తద్వారా ఆ జ్ఞానంతో ఉన్నత శిఖరాలుఅధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలుజి. అభిషేక్ అబ్రహం (ప్రధమ) జి. అనురుప్ మోషే (ద్వితీయ) ఎస్ హరి, విహాన్ (తృతీయ) కె. శ్రీజ (నాలుగో స్థానం), ఎస్ ఎస్ భావ్యశ్రీ (ఐదవ స్థానం) ఏజ్ గ్రూప్: కె. అయాన్ సిహెచ్ పార్ధవకృష్ణ, ఏ.అశ్విన్, వి. కార్తికేయ,యం.గగన, స్వాతిక సిహెచ్ మేఘశ్రీ, యం.చంద్రిక లకుబహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హారిక, అకాడమీ డైరెక్టర్ యోహానన్ హదస్సా అరుణ, పలువురు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.