గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
1 min readమాజీ మంత్రి కె ఈ ప్రభాకర్ ను మంత్రాలయం ఈడిగ గీత కార్మికుల సంఘం అధ్యక్షులు రచ్చమరి గోవింద్ గౌడ్ వినతి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గం లో ఉన్న గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ మంత్రి కెయి ప్రభాకర్ ను మంత్రాలయం నియోజకవర్గం ఈడిగ గీత కార్మికుల సంఘం అధ్యక్షులు రచ్చమరి ఈడిగ గోవింద్ గౌడ్ విన్నవించారు. ఆదివారం ఆయన కెఈ ప్రభాకర్ ఫాం హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం లో ఉన్న గీత కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం తో ఈడిగ కులస్తులకు అభివృద్ధి కి సహయ సహకారాలు అందించాలని కోరారు. వారి కి కావాల్సిన పని ముట్లు, వారి కి అవసరమైన అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. దీనికి కేఈ ప్రభాకర్ సానుకూలంగా స్పందించి గీత కార్మికులకు సహయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.