మహిళలపై హింస అనేది మహిళా హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది
1 min read– ఎన్ .హెచ్. ఆర్. జె .సి .ఐ ఆల్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రెటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో మహిళల హక్కులు చట్టాలు అనే అంశంపై నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రెటరీ, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పారా లీగల్ వాలంటీర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో చట్టపరమైన సామాజిక రాజకీయ మరియు ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అక్రమ రవాణాకు గురైన మహిళలు ,చిన్నారులు అత్యధికంగా హింసకు గురవుతున్నారు అన్నారు. సమానత్వపు హక్కు ,రక్షణ హక్కు ,శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండే హక్కులకు భంగం కలిగించకుండా విపక్షలేని సమాజం కోసం మనమందరం కృషి చేయాలన్నారు. మహిళల హక్కులు చట్టాలకు సంబంధించిన గోడపత్రికలను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కె.వి.ఆర్ కళాశాల విద్యార్థులు, లయన్స్ క్లబ్ మెంబర్లు ,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు, లక్ష్మీ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.